డియర్ ఫ్రెండ్స్, ఈరోజుల్లో చాలా మంది ఆన్లైన్ ఫుడ్, గ్రాసెరి, ఎలక్ట్రానిక్స్ యాప్స్ పది నిమిషాలలో మీ ప్రోడక్ట్స్ ను డెలివేరి చేయటం ప్రారంభించాయి. అందులో జేపతో, బ్లింక్లిట్, ఇంస్టా మార్ట్ మరియు బిగ్ బాస్కెట్ అంటూ చాలానే యాప్స్ ఉన్నాయి.
అయితే వీటికి కూడా మనం ప్రతి యాప్ యొక్క కాష్ బ్యాక్ వౌచర్ ను మనం ఇతర యాప్స్ నుండి పర్చేస్ చేసి, కొంత మొత్తంలో మీ మనీని మీరు సేవ్ చేసుకోవచ్చు. అయితే ఆ యాప్స్ ఏంటో ఇపుడు మీకు కొన్ని ఇక్కడ చెప్పబోతున్నాను.
- GyFTR
- Wooho
- Magicpin
- Zingoy
- Hubble
పైన పేర్కొన్న అన్నింటిలోనూ దాదాపుగా 2% నుండి 4% వరకు కాష్ బ్యాక్ ను ఇస్తున్నాయి. మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మీ ఇన్స్టంట్ డెలివేరి యాప్ యొక్క వౌచర్ ను ఈ కాష్ బ్యాక్ వౌచర్ యాప్లో వెతికి ఆ యాప్ యొక్క వౌచర్ ని పర్చేస్ చేసుకొని, మీ యొక్క ఇన్స్టంట్ డెలివేరి యాప్ లో రెడీమ్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ యాప్స్ అన్నీ ఆండ్రోయిడ్ మరియు యాప్ స్టోర్ లలో ఉన్నాయి. మరియు ఇవేకాక ఇపుడు ఫోన్ పే, paytm, మొబి క్విక్ మరియు లేజీ పే వంటి యాప్స్ లలో కూడా ఈ కాష్ బ్యాక్ వౌచర్స్ కలవు.